హుజూర్నగర్ కేకే మీడియా ఆగస్టు 26:
కెసిఆర్ ఏ తెలంగాణ రాష్ట్రానికి సరైనోడు అని అన్ని వర్గాల ప్రజలకు ఆదుకునే ఏకైక నాయకుడు కేసీఆర్ అని అందుకనే పార్టీలోకి వలసలు అని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు
శనివారం నాడు హుజూర్నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోచింతలపాలెం మండలం దొండపాడు గ్రామ ఎంపీటీసీ సంధ్యారాణి శేషు ,హుజూర్నగర్ మున్సిపాలిటీ 12వ వార్డు మాజీ వార్డ్ సభ్యులు కాల్వపల్లి బ్రహ్మారెడ్డి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ. బీఆర్ఎస్ తోనే పేద ప్రజలకు మేలు జరుగుతుంది. అని అన్నారు.అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి బిఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం అని ఆయన తెలిపారు.గులాబీ జెండాతో తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నరు అని ఆయన అన్నారు.సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధిని చూసి ప్రజలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. ప్రతీ కార్యకర్త కుటుంబానికి గులాబీ పార్టీ అండగా నిలుస్తున్నదని భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీలో రూ.100 చెల్లించి క్రియాశీలక సభ్యత్వం పొంది మృతిచెందిన కార్యకర్త కుటుంబానికి రూ.2 లక్షలు అందజేస్తున్నామని అన్నారు. సభ్యత్వాల నమోదులో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నదని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన . నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్ధిక భరోసా కల్పిస్తున్నదని అన్నారు. హుజూర్నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నామని అన్నారు. రానున్న రోజుల్లో ఇతర పార్టీల నుంచి కూడా బీఆర్ ఎస్ లోకి భారీగా వలసలు ఉంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన ప్రతీ కార్యకర్త క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేసి హుజూర్నగర్ నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు. హుజూర్ నగర్ మున్సిపాలిటీ నుండి పార్టీలో చేరిన వారు రణపంగు జార్జి, మణి రెడ్డి యాదవ రెడ్డి, మట్టపల్లి శైలజ షేక్ రెహమాన్ గుండెబోయిన మహేష్ మట్టేమడుగు వంశి నరసయ్య నాగేంద్రబాబు జడ సాయి తదితరులు జాయిన్ అయ్యారు. ఈ కార్యక్రమంలో చింతలపాలెం ఎంపీపీ కొత్తమద్ది వెంకటరెడ్డి, జడ్పిటిసి చంద్రకళా సైదిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు మధిర సత్యనారాయణరెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు పోతంశెట్టి శ్రీనివాసరావు, సర్పంచ్ పద్మా రంగారెడ్డి, ఉప సర్పంచ్ నరసింహారావు, సింగిల్ విండో చైర్మన్ కలగొట్ల కోటిరెడ్డి,నన్నేపంగు సత్యం,చిలకల రోసిరెడ్డి ,దనేశ్వరావు,షేక్ అబ్బాస్,లాజరు, అందే వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు…