కేకే మీడియా తెలంగాణకు ,, ఏపీ ఆగస్టు 31
Weather Report 31-8-2024: భారత వాతావరణ శాఖ (IMD) రిలీజ్ చేసిన తాజా బులిటెన్ ప్రకారం గుజరాత్ పక్కన తుపాను ఏర్పడింది. దానికి ఏస్నా (ASNA) అనే పేరు పెట్టారు. దాని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై పెద్దగా లేనట్లే. బంగాళాఖాతంలో అల్పపీడనం.. బలంగా ఉంటూ.. వాయుగుండంగా మారుతోంది. ఇది పూర్తిగా వాయుగుండం అవ్వడానికి మరో 24 గంటలు పడుతుంది. ఇది ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా వైపు కదులుతోంది. మరోవైపు నైరుతీ రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయి. ఈ పరిస్థితి వల్ల తెలుగు రాష్ట్రాల్లో వారం పాటూ వానలు కురుస్తాయి. అలాగే ఇవాళ కోస్తాంధ్రలో అతి భారీ వర్షాలు కురుస్తాయి. తెలంగాణలో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 2 వరకూ అతి భారీ వర్షాలు కురుస్తాయి. అలాగే కోస్తాంధ్ర, యానాం, తెలంగాణలో సెప్టెంబర్ 3 వరకూ అక్కడక్కడా భారీ వర్షాలు కూడా కురుస్తాయి.