హైదరాబాద్ కేకే మీడియా మార్చ్ 13
ఈరోజు జరగనున్న కరీంనగర్ సభకు హాజరు కాలేకపోతున్నట్లు తెలిపిన కేటీఆర్ గారు
గత రెండు రోజులుగా ఇంటి వద్దనే డాక్టర్ పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు
ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా నయం అయ్యే అవకాశం ఉందని తెలిపిన డాక్టర్
కొద్ది రోజులుగా విస్తృతంగా అనేక సభలు సమావేశాలలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు గత రెండు రోజులుగా తీవ్రమైన జ్వరం, ఫ్లూ లక్షణాలతో బాధపడుతున్నారు. మూడు రోజుల కింద కామారెడ్డిలో జరిగిన సమావేశం అనంతరం జ్వరంతో అస్వస్థతకు గురైన కేటీఆర్ గారు ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఈ నేపథ్యంలో ఈరోజు కరీంనగర్ లో జరుగుతున్న భారీ బహిరంగ సభకు హాజరు కాలేకపోతున్నట్లు తెలిపారు. డాక్టర్ల పర్యవేక్షణలో ఇంటి వద్దనే చికిత్స తీసుకుంటున్నారు. ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా నయం అవుతుందని తెలిపిన డాక్టర్లు.. కరీంనగర్ సభ విజయవంతం అయ్యేలా పార్టీ పరంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపిన కేటీఆర్, ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ ప్రతినిధులతో తన కార్యాలయం ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటున్నట్లు తెలియజేశారు.