నేరేడుచర్ల కేకే మీడియా జనవరి 3
మండలం లోని పెంచికల్ దిన్న ఆవాస గ్రామం తెలగరామయ్యగూడెం గ్రామానికి చెందిన సోమగాని లీలమ్మ భర్త లేటు వెంకటేశ్వర్లు వయస్సు: 80 సం వృద్ధ మహిళ తన ఇంటి లో ఒంటరిగా జీవిస్తుండగా బుధవారం ఉదయం సమయం లో గ్రామంలో జరుగుతున్న కార్యానికి పిలుపుకు గ్రామస్తుడు వెళ్లగా తలపై రక్తము తో అనుమానాస్పదం గా చనిపోయి ఉన్న. విషయాన్ని గమనించి చుట్టుపక్కల వారికి తెలియపరచగా. సుదూర ప్రాంతంలో ఉన్న వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా వచ్చిన సభ్యులు అనుమానం వ్యక్తం చేయడం . ఇట్టి ఘటన పై ఫిర్యాది చేయగా నేరేడుచర్ల ఎస్‌ఐ కేసు నమోదు చేసుకొని మృతురాలిని పోస్ట్ మార్టం కోసం హుజూర్నగర్ ఏరియా ఆసుపత్రి కి తరలించారు. సంఘటన విషయం తెలుసుకున్న హుజూర్నగర్ సిఐ డిఎస్పి సంఘటన స్థలాన్ని సందర్శించి డాగ్ స్క్వాడ్ తో పరిశీలించారు అనంతరం క్లూస్ టీం సంఘటన జరిగిన ప్రాంతంలో వివరాలు సేకరించారు.