తిరుమలలో కుండపోత
తిరుమల, తిరుపతిలో కుండపోత వర్షం కురుస్తోంది. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో అప్రమత్తమైన టీటీడీ అధికారులు పాపవినాశనం, శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలను తాత్కాలికంగా మూసేశారు. భారీ వరదతో మాల్వాడిగుండం పొంగిపొర్లుతుండటంతో కపిలతీర్థం పుష్కరిణికి వెళ్లకుండా భక్తులను నిలిపివేశారు.