తాజా మాజీ సర్పంచ్ కు ప్రైమరీ పాఠశాలలో ఘనంగా సన్మానం ప్రధానోపాధ్యాయులు గుగులోతు సైదా నాయక్
గరిడేపల్లి కేకే మీడియా జనవరి 3
గరిడేపల్లి మండల పరిధిలో ఉన్న పరెడ్డిగూడెం ప్రాథమిక పాఠశాలలో ఈరోజు పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుగులోతు సైదా నాయక్ ఆధ్వర్యంలో తాజా మాజీ సర్పంచ్ దంపతులకు ఘనంగా ఆత్మీయ సన్మానం చేసి మేమంటూ అందజేశారు సర్పంచ్ ఐదు సంవత్సరాల పదవీకాలంలో పాఠశాలలో ఏ సమస్య ఉన్న ప్రత్యేక దృష్టి పెట్టి పాఠశాల అభివృద్ధి కొరకు పాటుపడ్డారని గతంలో ప్రైమరీ పాఠశాలలో సౌకర్యాలు తక్కువగా ఉన్న గ్రామ సర్పంచ్ ప్రత్యేక శ్రద్ధతో పాఠశాలలో సమస్య లేకుండా కొంతమంది దాతలు మరియు వారి సొంత ఖర్చులతోడ్రాయింగ్స్ స్వతంత్ర సమరయోధుల పెయింటింగ్ పాఠశాలకు ఏ సమస్య ఉన్నా కూడా తన సొంత సమస్య లాగా భావించి పాఠశాలకు అభివృద్ధికి తోడ్పడ్డారని ఈరోజు తాజా మాజీసర్పంచ్ వీరం రెడ్డి లక్ష్మీశంబిరెడ్డిని పాఠశాల విద్యార్థిని విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు అదేవిధంగా మాజీ విద్యా కమిటీ చైర్మన్ అమరావరపుమరియమ్మ గారిని కూడా మెమొంటో అందజేసి ప్రత్యేక శాలువాతో సన్మానం చేశారు మాజీసర్పంచ్ మాట్లాడుతూ మాకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెల 5000 రూపాయలు జీతం గా ఇచ్చిన కూడా అదే పైసలు పెట్టి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థి విద్యార్థుల సౌకర్యార్థం కొరకు అదే జీతంతో ఐదు సంవత్సరాలుప్రతి నెల 5000 ఇచ్చి విద్యా వాలంటీర్ గా పెట్టి విద్యార్థుల విద్యార్థుల అభివృద్ధి కొరకు పాఠశాల అభివృద్ధి కొరకు పాటుపడ్డామని అన్నారు పదవి ఉన్నా లేకున్నా పాఠశాల అభివృద్ధి కొరకు మేము సతీసమేతంగా ఏ సమస్య ఉన్నా కూడా మా సొంత సమస్య లాగా భావించి పాఠశాల అభివృద్ధికి తోడ్పడుతామని వారు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయురాలు టి రజిత గ్రామపంచాయతీ కార్యదర్శి రేణుక అంగన్వాడి టీచర్ సుగుణ ఆయా నరసమ్మ విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు