తాండూరుకు చీకోటి ప్రవీణ్ రాకఆహ్వానించిన గోశాల సేవాల సమితి
తాండూరు, కేకే మీడియజనవరి10
జనవరి 23న తాండూరుకు గోభక్తులు, హిందూ ధర్మప్రచారకులు డాక్టర్ చీకోటి ప్రవీణ్ కుమార్ విచ్చేస్తున్నారు. అయోధ్యలో భవ్య రామమందిర ప్రారంభాన్ని పురస్కరించుకుని తాండూరు గోశాల సేవా సమితి ఆధ్వర్యంలో అయోధ్య ఉత్సవాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా బుధవారం తాండూరు గోశాల సేవా సమితి అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి, సభ్యులు ఓం ప్రకాష్ సోమాని, పటేల్ కుమార్ లు హైదరాబాద్ లో చీకోటి ప్రవీణ్ కుమార్ ను కలిశారు. తాండూరులో నిర్వహించే అయోధ్య ఉత్సవాలలో భాగంగా సీతారాముల ఊరేగింపు,నగర సంకీర్తనలు నిర్వహిస్తున్నట్లు ఆయనకు వివరించారు.