హైదరాబాద్ కేకే మీడియా సెప్టెంబర్ 5;
తమిళ సూపర్ స్టార్ ముద్దుగా అభిమానులు తలైవా అని పిలుచుకునే రజనీకాంత్ కు గవర్నర్గా అవకాశాలు లభించబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో రాజకీయాల్లోకి రావాలనుకున్న రజినీకాంత్ ఆరోగ్య సమస్యలతో రాజకీయాల కు వెళ్ళొద్దని నిర్ణయించుకున్న తమిళనాడు తనకున్న ఫాలోయింగ్ తో పాటు దేశవ్యాప్తంగా రజనీకున్న ఫాలోయింగ్ ని తమ ఖాతాలో వేసుకునేందుకు అధికార కేంద్ర బిజెపి ప్రభుత్వం పలుమార్లు బిజెపి పార్టీలోకి రావాలని ఆహ్వానించింది. ఇంతకాలంగా సున్నితంగా పార్టీలో చేరిగా విషయాన్ని తిరస్కరించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం తలైవాకు గవర్నర్ గా అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి.
. ఇటీవల యూపీ సీఎం యోగి, జార్ఖండ్ గవర్నర్ రాధాకృష్ణన్, తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వంతో రజినీ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇప్పటికీ సూపర్ స్టార్ గా సంవత్సరానికి ఒక సినిమా లు తీస్తూ అభిమానాన్ని చురగొంటున్న సూపర్ స్టార్ కి కేంద్రం ఇవ్వాలనుకున్న పదవిని స్వీకరిస్తారో లేదో వేచి చూడాలి మరి.
తలైవా ఇక గవర్నర్ ?
RELATED ARTICLES