నారాజ్ అవుతున్న తెలుగు తమ్ముళ్లు..?
హైదరాబాద్ కేకే మీడియా ఆగస్ట్ 12:
అధినేత దర్శన భాగ్యం దొరకక నాగరాజ్ అయిపోతున్నారు తెలుగు తమ్ముళ్ళు. ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ చుక్కాని లేని నావలా సమర్థవంతమైన నాయకుడు లేని పార్టీగా ఉండిపోయింది.
2014 ఎన్నికల్లో విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టిడిపి పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టి నా తెలంగాణలో పార్టీ పటిష్టతకు సమయం ఇవ్వకపోవడంతో నాయకత్వం పక్క పార్టీలోకి తొంగి చూడడం తో తెలంగాణలో బలహీనపడుతూ వచ్చింది.
జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మాత్రం
ఎప్పటిలాగే అభివృద్ధి, సమీకరణలు అంటూ పార్టీని నమ్ముకున్న, పార్టీ కోసమే ప్రాణం ఇచ్చే కార్యకర్తలను ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో పట్టించుకోకపోవడంతో నైరాష్ట్యానికి గురైన కార్యకర్తలు 2019 ఓటమి అనంతరం జరిగిన పరిణామాలు నేపథ్యంలో అయ్యో బాబు గారు మళ్లీ అధికారం కోల్పోయారు శత్రువులు దాడి చేస్తున్నారు మన బాబుని మనం కాపాడుకుందాం అని ప్రాణాలకు తెగించి అండగా నిలిచిన , పార్టీని బతికించుకొని మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలని కంకణం కట్టుకున్న సాధారణ కార్యకర్త మొదలు జాతీయస్థాయి నాయకత్వం వరకు అలుపెరగని పోరాటం చేసి వారి వారి ప్రాంతాల్లో పార్టీ పటిష్టతకు చంద్రబాబుకు అండగా నిలుస్తూ అధికారం మళ్లీ చేజెక్కించుకునే దిశగా సహకారం అందించారు.
చంద్రబాబు ఆంధ్ర సభల్లో ఈసారి అధికారంలోకి వచ్చాక కార్యకర్తల సంక్షేమం కూడా చూసుకుంటాను వారికి సమయం ఇస్తానని తెలిపిన అలా జరగడంలేదని వాపోతున్నారు
ఇక తెలంగాణలోనీ పరిస్థితిలోనూ ఎలాంటి మార్పు లేదు . ఇక్కడ సమర్థవంతమైన నాయకత్వాన్ని నియమించకపోవడంతో ఇక్కడి నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు ఇబ్బందులు తప్పడం లేదని వాపోతున్నారు. ఈమధ్య చంద్రబాబు తెలంగాణలో పర్యటన సందర్భంగా ఎన్టీఆర్ భవన్ కి విచ్చేసినప్పుడు అభిమానులు చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నం చేసిన అతి కొద్ది మందికి మాత్రమే ఆ అవకాశం లభించడం మిగతా వారికి కనీస దర్శన భాగ్యం కరువవ్వడం , తెలంగాణలో పార్టీని బతికించికినేందుకు వారి వారి ప్రాంతాల్లో సొంత ఖర్చులు పెట్టుకొని మరి కార్యక్రమాలు చేస్తూ వస్తున్న నాయకులకు అధినాయకునికి వారి సమస్యలు చెప్పుకునే అవకాశాన్ని కల్పించకపోవడంతో బాహాటంగానే విమర్శిస్తున్నారు.
ప్రజలలో ప్రాముఖ్యం లేని కొందరు నేతలకే ప్రాధాన్యత ఇస్తున్నారని చంద్రబాబును జైల్లో ఉంచినప్పుడు బాబు కోసం, పార్టీ పునరుజీవం కోసం తాము పడ్డ కష్టాన్ని పక్కకు నెట్టి తెలంగాణ పార్టీని మేమే కాపాడుతున్నామన్న భావనలో ఉన్న కొందరు నేతలు బాబును కలవడానికి వస్తే కల్పించకపోగా బూతు పురాణంతో అవమానపరిచారని ఇలానే కొనసాగితే పార్టీ పటిష్టతకు భంగం బాటిల్లుతుందని , పార్టీని బతికించాలని, చంద్రబాబును ఉన్నత స్థానంలో చూడాలని కోరుకున్న మాలాంటి కార్యకర్తలకు ఇలాంటి అవమానాలు సరికాదన్నారు.
బాబు పరిపాలనతో పాటు కార్యకర్తల క్షేమాన్ని చూడకపోతే పార్టీకి నష్టం వాటిల్లుతుందన్నారు. కష్టకాలంలో అండగా నిలిచిన కార్యకర్తలు లేనిదే పార్టీ మనుగడ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు.
ఇప్పటికైనా బాబు వాస్తవాలు తెలుసుకోవాలని, నటించే నాయకుల మాటలు వినకుండా వాస్తవ స్థితిని పరిశీలించి న్యాయం చేయాలని కార్యకర్తలు కోరుతున్నారు.