ఢిల్లీ గణతంత్ర వేడుకల్లో డప్పు వాయించిన నన్నెపంగ రమణ
సూర్యాపేట జిల్లానేరేడుచర్ల కేకే మీడియా జనరేటర్ 27
ఢిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకలో సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం దిర్శించర్ల గ్రామానికి చెందిన డప్పు కళాకారిణి నన్నెపంగ రమణ పాల్గొని తన ప్రతిభను చాటారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, శకటం ఇంచార్జి విశ్వకర్మ సహకారంతో అందె మ్యూజిక్ అకాడమీ అందె భాస్కర్ సౌజన్యంతో శుక్రవారం ఏర్పాటు చేసిన చాకలి అయిలమ్మ, రాంజీ గోండు, కొమురం భీమ్ ల శటకం వెంట కళాబృందంతో కలిసి డప్పు కొట్టె అవకాశం వచ్చిందని ఆమె అన్నారు. రమణ తమ భర్త సహకారం తో డప్పు శిక్షణ డప్పు కళాకారుడు అమరవరపు సతీష్ దగ్గర డప్పు శిక్షణ తీసుకోని డప్పు కళా రంగంలో రానిస్తుంది. గణతంత్ర వేడుకలో పాల్గొనడం పట్ల కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు రమణకీ అభినందనలు తెలిపారు.