హైదరాబాద్ కేకే మీడియా సెప్టెంబర్ 13
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రైతులకు వరంగా ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఇప్పుడు డెడ్ స్టోరేజ్ కి చేరువలో ఉంది. ఆయకట్టు పరిధిలో సుమారు మూడు లక్షల 50 వేల ఎకరాల్లో సాగునీరు అందించి ఆదుకుంటున్న ఈ ప్రాజెక్టు నీరు రాక క్రాప్ హాలిడే ప్రకటించుకున్నారు.
ఎడమ కాలువ ఆయకట్టు ప్రాంతాలైన ఖమ్మం నల్లగొండ జిల్లాల్లో సుమారు పది లక్షల 37 వేల ఎకరాలు సాగునీరు అందించాల్సి ఈ ప్రాజెక్టు వర్షాభావ ప్రభావంతో మీరు రాక డెత్ స్టోరేజ్ కి మారిపోయింది. కృష్ణ బేసిన్లో వర్షాలు పడకపోవడం ఎగువ నుంచి వరదలు లేకపోవడం కరువుకు కారణంగా కనిపిస్తోంది. ఖమ్మం నల్లగొండ జిల్లాలో దాదాపు 3,50,000 ఎకరాలు బీడు భూమిగా మారిపోయాయి.
బోర్లు బావులు, చెరువులపై ఆధారపడి పంటలు వేసుకున్న రైతులు భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో ఖరీఫ్ పంట చివరి వరకు దినదిన ఘనంగా ఉండడంతో రైతులు ఏమి చేయాలో దిక్కుతోచని ఆందోళన పరిస్థితిలో ఉన్నారు.