Tuesday, December 10, 2024
HomeDevotionalడిసెంబర్ 3న స్థానికులకు శ్రీవారి దర్శనం.. టిటిడి

డిసెంబర్ 3న స్థానికులకు శ్రీవారి దర్శనం.. టిటిడి

డిసెంబర్ 1న (ఆదివారం) తిరుపతి మహతి ఆడిటోరియం లో , తిరుమలలోని బాలాజీ నగర్ లోని కమ్యూనిటీ హాల్ నందు ఉదయం 5 గంటలకు టోకెన్లు జారీ
టిటిడి ధర్మకర్తల మండలి నవంబర్ 18న జరిగిన తొలి సమావేశంలో ప్రతి నెలా మొదటి మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డిసెంబర్ 3న (మొదటి మంగళవారం) స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు టిటిడి ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా డిసెంబర్ 1న ఆదివారం తిరుపతి మహతి ఆడిటోరియంలో, తిరుమల బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్ నందు ఏర్పాటు చేసిన కౌంటర్లలో ఉదయం 5 గంటలకు టోకెన్లును టిటిడి జారీ చేయనుంది.
తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి , రేణిగుంట మండలాలతో పాటు తిరుమలకు చెందిన స్థానికులు తమ ఆధార్ ఒరిజినల్ కార్డును చూపించి టోకెన్లు పొందవచ్చని టిటిడి తెలియజేయడమైనది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments