Saturday, January 17, 2026
HomeDevotionalడిసెంబర్ 14న విశేష పూజలకు ముస్తాబైన గంగాభవాని ఆలయం

డిసెంబర్ 14న విశేష పూజలకు ముస్తాబైన గంగాభవాని ఆలయం

విశేష పూజలకు ముస్తాబైన గంగాభవాని ఆలయం

నేరేడుచర్ల :
తెలంగాణ రాష్ట్రం సూర్యపేట జిల్లా
నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని జానపహాడ్ రోడ్డు లో గల పురాతన శ్రీ గంగా భవాని ఆలయం పునర్నిర్మాణము చేయబడి డిసెంబర్ 14న అమ్మవారికి విశేష పూజలకు సన్నద్ధమవుతోంది.
ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం 6 గంటల నుండి తోరణ సేవ,గణపతి పూజ, పుణ్యాహవాచనం, పంచగవ్యప్రాసన, రక్షాబంధన, మండపావాహన, అమ్మవారికి విశేష ద్రవ్యాలతో అభిషేకం, మహానివేదన,మహా పూర్ణాహుతి ప్రసాద వితరణ కార్యక్రమాలు లింగాల వేదపండితులు బ్రహ్మహర్షి ఇరువంటి సత్యనారాయణ శర్మ గారి ఆధ్వర్యంలో పూజలు నిర్వహించబడును. ఆలయ ధర్మకర్త కంభం సీతారాం రెడ్డి సుమారు 13 లక్షలు వెచ్చించి దేవాలయం పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఆయన ఆధ్వర్యంలో దేవాలయం లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నందున భక్తులు. పూజ కార్య క్రమాలలో పాల్గొనీ విజయవంతం చేయాలని ఆలయ కమిటీ తెలిపారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments