నేరేడుచర్ల కేకే మీడియా ఫిబ్రవరి 28
వరంగల్ లో మెడికల్ పీజీ స్టూడెంట్ ప్రీతి నాయక్ మరణం పట్ల మాతరం యూత్ ఆధ్వర్యంలో నేరేడుచెర్ల ప్రధాన కూడలి వద్ద కొవ్వుతుల తో నివాళి అర్పించి మౌనం పాటించారు.ఈ సంధర్బంగా మాతరం యూత్ అధ్యక్షులు జింకల భాస్కర్ మాట్లాడుతూ ప్రీతి ఒక గిరిజన కుటుంబం నుండి వచ్చింది. ప్రీతి పై తల్లిదండ్రులు ఎంతో నమ్మకం తో తనను మెడికల్ దాకా చదివించారు అంటే ఎన్ని బాధలు,ఎన్ని కష్టాలు పడి చదివించారో. ప్రీతి మరణానికి కారణమైన సైఫ్ మరియు అతనితో ఎవరు ఉన్నారనేది Fast track కోర్టు ద్వారా ఎంక్వైరీ చేయించి శిక్షించాలని కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో KK మీడియా ఛైర్మెన్ న్యాయవాది సుంకర క్రాంతి కుమార్ యారవ సురేష్ రామకృష్ణ కల్లూరు సర్పంచ్ పల్లెపంగ నాగరాజు లయన్స్ క్లబ్ అధ్యక్షులు సత్యనారాయ రెడ్డి ప్రభాకర్ రెడ్డి భట్టు మధు BSP సూర్యాపేట జిల్లా ఇంచార్జి రాపోలు నవీన్ కుమార్ కొండమీద నర్సింహ రావు అమరారపు వెంకటేశ్వర్లు రమణ లక్మి హుస్సేన్ యువకులు పాల్గొన్నారు