గరిడేపల్లి కేకే మీడియా అక్టోబర్ 3
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలలో అత్యున్నతమైన టెలికాం అడ్వైజరీ కమిటీ బోర్డు మెంబర్ గా పోకల వెంకటేశ్వర్లు నియమితులయ్యారు.
తెలంగాణ మలిదశ పోరాట ఉద్యమంలో అత్యంత క్రియాశీలకమైన పాత్ర నిర్వహించి ఉమ్మడి నల్లగొండ జిల్లాకి చెందిన వ్యక్తికి దక్కిన అరుదైన గౌరవం అని పోకల అన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమం లో చురుకైన పాత్ర పోషించి టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడిగా, హుజూర్నగర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించి, గత కొన్నేళ్లుగా భారతీయ జనతా పార్టీ లో సేవలందిస్తూ సూర్యపేట జిల్లా ఉపాధ్యక్షుడిగా, పెన్ పహాడ్ మండల ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులకు విశ్వాసంగా ఉంటూ. అంచలంచలుగా ఎదిగి ఇప్పుడు దేశంలో అత్యున్నతమైన టెలికాం అడ్వైజర్ బోర్డు మెంబర్గా ఎన్నికవ్వడం పట్ల సంతోషంగా ఉందన్నారు. ఇందుకు సహకరించిన గురువర్యులు , భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు తన వెన్నంటి సహకరించిన తెలంగాణ మలిదశ ఉద్యమకారులకు కృతజ్ఞతలు తెలిపారు