హుజూర్నగర్ కేకే మీడియా ఆగస్టు 28
తిరుమల తిరుపతి దేవస్థానం నూతన పాలకమండలి సభ్యుడుగా నియమితులైన హుజూర్నగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సాముల రామిరెడ్డికి హుజూర్నగర్ కోర్టు ఆవరణలో ఘన సన్మానం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన పాలకమండలిలో చోటు కల్పించిన తర్వాత మొట్టమొదటిసారిగా హుజూర్నగర్ విచ్చేసిన సందర్భంగా హుజూర్నగర్ కోర్టు ఆవరణలో సీనియర్ సివిల్ జడ్జ్ శ్యాం కుమార్, జూనియర్ సివిల్ జడ్జ్ మారుతి ప్రసాద్ ల తో పాటు బార్ అసోసియేషన్ సభ్యులు న్యాయవాదులు ఘనంగా సన్మానించారు
ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ రామిరెడ్డికి ఈ అవకాశం లభించడం హుజూర్నగర్ బార్ అసోసియేషన్ కు గర్వకారణమని అన్నారు. అంతకుముందు వారి స్వగృహంలో భారీ సంఖ్యలో అభిమానులు కార్యకర్తలు మిత్రులు శ్రేయోభిలాషులు ఘన సన్మానం లు నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారు.
వారిని కలిసిన ప్రముఖులలో కోదాడ మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి, రోజు ఫౌండేషన్ చైర్మన్ పిల్లుట్ల రఘు, వివిధ పార్టీల రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు