తిరుపతి కేకే మీడియా సెప్టెంబర్ 4
తిరుమల తిరుపతి దేవస్థానం లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నూతన పాలకమండలిని ప్రకటించగా
తెలంగాణ రాష్ట్రం హుజూర్నగర్ నియోజకవర్గం అమరవరం గ్రామానికి చెందిన హైకోర్టు న్యాయవాది హుజూర్నగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సామల రామిరెడ్డికి నూతన పాలకమండలిలో చోటు లభించిన విషయం విధితమే .
నూతన పాలకమండలి చైర్మన్గా భూముల కరుణాకర్ రెడ్డి మొదట ప్రమాణ స్వీకారం చేయగా సోమవారం నాడు సభ్యులుగా సాముల రామిరెడ్డి , అశ్వర్ధ నాయక్
లచే తిరుమల తిరుపతి దేవస్థాన జెఈవో
వీరబ్రహ్మం. వారి ఇరువురిచే ప్రమాణ స్వీకారం చేయించారు.
ప్రమాణ స్వీకరణ అనంతరం సభ్యుడి హోదాలో దైవ దర్శనం తరువాత రంగనాయ మండపంలో వేద పండితులచే వేద ఆశీర్వచనం నిర్వహించి దేవస్థాన డిప్యూటీ ఈవో లోకనాథం శ్రీవారి చిత్రపటం తో పాటు ప్రసాదాలను అందించారు
ఈ కార్యక్రమంలో దేవస్థాన డిప్యూటీఈవో శ్రీమతి కస్తూరిబాయ్ ఇతర అధికారులు రామిరెడ్డి కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులు పాల్గొన్నారు