హుజూర్నగర్ కేకే మీడియా నవంబర్ 4
అభివృద్ధికి ఆకర్షితులై, బీఆర్ఎస్ పార్టీలో చేరికలు
బీఆర్ఎస్ లో చేరికల జోష్…. కాంగ్రెస్ బేజారు.
మేళ్లచెరువు మండలం , రాఘవపురం గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన 25 కుటుంబాలు బీఆర్ఎస్ లో చేరిక
మరియు..
గరిడేపల్లి మండలంలోని రేగులగడ్డ తండా నుంచి 30 కుటుంబాలు ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లోకి చేరడం జరిగింది.
ఈ సందర్భంగా వారి చేతుల మీదుగా పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించడం జరిగింది.పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే సైదన్న అందరిని నవ్వుతూ పలకరిస్తారని,ప్రతి ఒక్కరినీ గుర్తు పెట్టుకొని పేరు పెట్టి పిలుస్తారని, హుజుర్ నగర్ అభివృద్ధి ఆయనతోనే సాధ్యం అని, సైదిరెడ్డి గారికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ, అభివృద్ధికి ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీ లో చేరడం జరిగింది అని, అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న తండాలను కూడా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నారని తండాలను గ్రామపంచాయతీలు చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని తెలిపారు..