జ్వరాలతో కుదేలవుతున్న కుటుంబాలు
…. సీరియస్ గా తీసుకొని ప్రభుత్వయంత్రాంగం
….. అవగాహన లోపం తో సొంత నిర్ణయాలతో వైద్యం
నేరేడుచర్ల కేకే మీడియా ఆగస్ట్:
ఒక్క జ్వరం కుటుంబ జీవితాలను చిద్రం చేస్తున్న నేటి పరిస్థితికి ఎన్నో కుటుంబాలు వీధిన పడే పరిస్థితికి వచ్చాయంటే నే ప్రస్తుత సామాన్య ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ప్రస్తుతం వస్తున్న విష జ్వరాలతో ప్రతి ఇంట పేషంట్ల శాతం పెరుగుతూ వస్తుంది.
కరోనా తర్వాత ఆ స్థాయిలో కాకున్నా కుటుంబాలను చిత్రం చేసే స్థాయికి ప్రస్తుత విషయాలు వస్తున్నాయి. కుటుంబ సభ్యుల్లో ఒక్కరికి జ్వరం వస్తే ఒకరి తర్వాత ఒకరికి అంటూ వ్యాధిలా కుటుంబ సభ్యులందరికీ వస్తున్నాడంతో వాటి ప్రభావం రోజుల తరబడి వేధిస్తూ కనీస పనులు చేసుకోలేని దుస్థితి , ఇటు ఆర్థికంగా , ఆరోగ్యపరంగా చిటికపోతున్న మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి ,పేద ప్రజల పరిస్థితి చెప్పనలివి కాకుండా తయారవుతుంది.
వచ్చిన జరానికి మెడికల్ షాపుల్లో మందులతో నయం అవుతుందిలే అనుకొని వారు ఇచ్చిన గోలీలు మింగి రోగనిరోధక శక్తి అధికంగా ఉన్నవారు వెంటనే చేరుకున్న మిగిలిన కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు మాత్రం ఆసుపత్రి కి వెళ్ళందే నయం కాని పరిస్థితి. దీంతో తమ తమ పనులకు వెళ్ళలేక , ఉన్న డబ్బులతో ఆరోగ్యం నయం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఇటు ఆర్థికంగా,అటు ఆరోగ్యపరంగా పూర్తిగా నష్టపోతున్నారు. మరికొంత మంది విపరీతమైన జ్వరం తగ్గక ఇతర జబ్బులు వస్తూ మిర్యాలగూడ, ఖమ్మం, హైదరాబాదు లాంటి సుదూర ప్రాంతాలకు కార్పొరేట్ వైద్యానికి వెళ్లి లక్షలు ఖర్చు చేసే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. దీంతో ప్రజల ఆర్థిక ప్రమాణాలు పూర్తిగా దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది.
ఆర్థికం ఆరోగ్యం పూర్తిగా నయమైతే తిరిగి మళ్లీ సాధించుకోవచ్చు ఏమో కానీ జ్వరం వచ్చి తగ్గాక మళ్లీ రోగం తిరగబెట్టడం, ఏ పని చేయలేక ఒళ్లంతా నొప్పులతో ఇబ్బంది పడుతుండటం తో ప్రజలు ఏం చేయాలో అర్థం కాక సతమతమవుతున్నారు.
ప్రభుత్వం జరాలు రాకుండా తీసుకోవాల్సిన చర్యలు వచ్చాక అందించే సేవలు విషయంలో తీసుకునే నిర్ణయాలు ప్రజలను సంతృప్తి పరచలేకపోతున్నాయి. ఎన్నికల అప్పుడు చేసిన వాగ్దానాలు ఇలా ప్రజలు ప్రతి కుటుంబంలో అనారోగ్యం పాలైతే దానిపై ఎలాంటి చర్చలు లేకపోవడం తో ప్రజలు ప్రభుత్వాన్ని తప్పు పట్టే పరిస్థితి ఏర్పడుతుంది.
అనారోగ్యం మన చేతిలోనే ఉన్నట్లు ఆరోగ్యంగా ఉండడానికి మన తీసుకునే ఆహారం, రోజువారి దినచర్య, మన చుట్టూ ఉండే పరిసరాల అపరిశుభ్రత ఇవన్నీ ప్రధాన కారణాలే అని తెలిసిన మన అలవాటులను మార్చుకునే విషయంలో ప్రజల తప్పు ఉన్నప్పటికీ జ్వరాలు (జబ్బులు)వచ్చాక ప్రజలు తమకు తెలిసినట్లుగా సొంత వైద్యం చేసుకొని ఆరోగ్యాన్ని పాడు చేసుకుని కార్పొరేట్ వైద్యం దాకా లక్షలు వైద్యానికి తగలేసే పరిస్థితులు వారికి వారే కొనితెచ్చుకున్నారన్న విమర్శలు లేకపోలేదు.
ప్రాథమిక దశలోనే అర్హత కలిగిన డాక్టర్ల తో వైద్యం చేయిస్తే దానికి తగ్గ ప్రతిఫలం ఉంటుందని డాక్టర్లు పదేపదే చెబుతూ వస్తున్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజలు పడుతున్న ఇబ్బందులు గమనించి ప్రత్యేక కార్యాచరణలతో ప్రజా సమస్యలకు పరిష్కారం ఏర్పడాల చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.