కేకే మీడియా సూర్యాపేట జిల్లా పాలకవీడు నవంబర్ 27
వందకు వందశాతం మనమే గెలుస్తున్నాం ఓటు అడిగే హక్కు, ధైర్యంమన బీఆర్ఎస్ పార్టీకే ఉంది ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి
ఎన్నికల ప్రచారంలో పాల్గొనీ మాట్లాడుతున్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఉదయం నియోజకవర్గ పరిధిలోని పాలకవీడు మండలంలోని గుడుగుంట్ల పాలెం మరియు ముసిఒడ్డు సింగారం గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హుజుర్ నగర్ ఎమ్మెల్యే మరియు బీఆర్ఎస్ పార్టీ హుజుర్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి మరియు మండల ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు హాజరయ్యారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలు బొట్టుపెట్టి, మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు అలాగే ఎన్నికల పోరులో సైదన్న వెంటే ఉంటామని గ్రామస్తులు తెలిపారు ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలను గడపగడపకు వివరిస్తూ ప్రచారంలో నాయకులు కార్యకర్తలు ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు._