హైదరాబాద్ కేకే మీడియా ఆగస్టు 31
తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ లో అసెంబ్లీఎన్నికలు జరుగుతాయని అందరూ అనుకుంటున్నారు. కానీ కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం మాత్రం ప్రస్తుత పరిణామాల దృష్ట రాజకీయ క్రీడ మొదలెట్టింది.
డిసెంబర్ నుంచి జనవరి వరకు జరిగే ఎన్నికల నేపథ్యంలో ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
ఈ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని జాతీయ రాజకీయాల్ని ఏకమవుతున్న ఇండియా కూటముల జోరుని తగ్గించేందుకు పావులు కదిపే దిశగా బిజెపి ఎత్తుగడలు చేస్తుంది.
పార్లమెంటు అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేసే నిర్ణయం తీసుకుంది. పార్లమెంటు తీసుకుపోయే కీలక నిర్ణయాల్లో జెమిలి ఎన్నికలతో పాటు
ఇండియా కూటమిని దెబ్బతీసే ప్రతిష్టాత్మకమైన మహిళా బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
మహిళా బిల్లు ప్రవేశపెడితే ఇండియా కూటములోని మహిళా బిల్లును వ్యతిరేకించే ప్రధాన పార్టీలతో పాటు కూటమికే పెద్ద ఎదురు దెబ్బ తలిగే అవకాశం ఉంది.
బిజెపి మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు పకడ్బందీ ప్రణాళికలు రూపొందిస్తుంది.
ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ ఎత్తుగడలన్నీ మారే అవకాశం ఉంది
మహిళా బిల్లు కేంద్రం ప్రవేశపెడితే తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయాలు పూర్తిగా మారే ఛాన్స్ ఉంది
కేంద్రం ఎత్తుగడలకు ప్రాంతీయ పార్టీలు ఇండియా కూటమి చిత్తయే ఎత్తుగడలతో బిజెపి ప్రభుత్వం ముందుకు పోతుందని విశ్వసనీయ సమాచారం.