సూర్యాపేట కేకే మీడియా జనవరి 1
జిల్లా పోలీసు కార్యాలయం నందు నూతన సంవత్సర వేడుకలు జిల్లా అదనపు ఎస్పీ నాగేశ్వరరావు. ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
. ఈ సందర్భంగా అదనపు ఎస్పి నాగేశ్వరరావు నూతన సంవత్సర వేడుకల కేక్ ని కట్ చేసిన అనంతరం మాట్లాడుతూ అందరూ టీమ్ గా పని చేసి ఉత్తమ సేవలు అందించాలని కోరారు.
గత సంవత్సరంలో పోలీసు సిబ్బంది బాగా పని చేసారని, ఈ సంవత్సరం కూడా జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే IPS పర్యవేక్షణలో, జిల్లాలో ప్రజలకు ఉత్తమైన పోలీసు సేవలు అందిస్తామని, శాంతిభద్రత పరిరక్షణలో నిత్యం కృషి చేస్తామని అదనపు ఎస్పి తెలిపినారు. నిర్దేశిత లక్ష్యాల కోసం ప్రనాలిక ప్రకారం అందరూ కృషి చేయాలని హాజరైన అధికారులకు కోరారు
ఈ కార్యక్రమంలో DSP లు నాగభూషణం, ప్రకాష్, CI లు మహేష్, నాగార్జున, రాజశేఖర్, అశోక్, శివ శంకర్, మురారి, రాము, రామలింగారెడ్డి, రాఘవులు, రామకృష్ణా రెడ్డి, RI నారాయణ రాజు, SI లు ఉన్నారు.