హుజూర్నగర్ కేకే మీడియా సెప్టెంబర్ 6;
హుజూర్నగర్ కోర్టులో సెప్టెంబర్ 12న జరగనున్న జిల్లా అదనపు కోర్టు విభాగ ప్రారంభోత్సవాన్ని జయప్రదం చేయాలని హుజూర్నగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సాముల రామ్ రెడ్డి కోరారు
బుధవారం కోర్టు ఆవరణలోని వార అసోసియేషన్ కార్యాలయంలో జిల్లా అదనపు కోర్టు ప్రారంభోత్సవం సందర్భంగా
న్యాయవాదులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ వర్చువల్ ప్రారంభోత్సవానికి జిల్లా అధికారులతో పాటు ఇతర అధికారులు ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలిపారు. నాకు అనుగుణంగా ఏర్పాట్లు మరియు నిర్వహణ కమిటీని ఎన్నుకున్నారు.
కోర్టు పరిధిలోని ప్రముఖులను ప్రారంభోత్సవానికి ఆహ్వానించి దిగ్విజయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ప్రారంభోత్సవానికి విచ్చేసిన వారికి ఎలాంటి ఆసౌకర్యం కలగకుండా బార్ అసోసియేషన్ సభ్యులు తగిన ఏర్పాటు చేయాలని సూచించారు
ప్రారంభోత్సవ అనంతరం బార్ అసోసియేషన్ అధ్యక్షులు భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.