జాన్ పహాడ్ షహీద్ దర్గా కాంట్రాక్టర్ల దోపిడీని అరికట్టాలి
హుజూర్ నగర్ నియోజక వర్గ బీఎస్పీ ఇంచార్జి రాపోలు నవీన్ కుమార్
సూర్యాపేట జిల్లానేరేడుచర్ల కేకే మీడియా జనవరి 10
హుజూర్నగర్ నియోజకవర్గం పాలకీడు మండలం తెలంగాణ రాష్టంలో మత సామరస్యానికి ప్రతీకైన జాన్ పహాడ్ షహీద్ దర్గా విశిష్టత తెలియని వారు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉండరు. నిత్యం భక్తులు దర్శనానికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.జాన్ పహాడ్ షహీద్ దర్గా వద్ద కందూరుకు వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులను నిలువు దోపిడీ చేస్తున్న దర్గా కాంట్రాక్టర్లు అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తున్నారని హుజూర్ నగర్ నియోజక వర్గ బీఎస్పీ ఇంచార్జి రాపోలు నవీన్ కుమార్ ఆరోపించారు
వక్ఫ్ బోర్డ్ నిబంధనలకు విరుద్ధంగా ధనార్జనే ధ్యేయంగా భక్తుల వసతులు గాలికొదిలేసి అందినకాడికి దోచు కుంటున్నారని ప్రతి ఏటా ఉర్సు ఉత్సవాలకు లక్షల్లో భక్తులు కోట్లలో ఆదాయం వస్తున్నప్పటికీ కనీస వసతుల కల్పనలో వక్ఫ్ బోర్డ్ అధికారులు విఫలమయ్యారని
హుజూర్ నగర్ ఆర్డీవో కార్యాలయంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు
దర్గా పరిసర ప్రాంతాల్లో అపరిశుభ్రమైన వాతావరణంలో భక్తులు పడుతున్న అవస్థలు అంతా ఇంతా కావని సైదన్న సన్నిధిలో మధ్యతరగతి కుటుంబాలు హడాలెత్తి పోతున్నారన్నారు అంతే కాకుండా దర్గా చుట్టూ పక్కలోనే విపరీతమైన మద్యం అందుబాటులో ఉంటుందని ఎక్సైజ్ శాఖ వెంటనే చర్యలు తీసుకొని బహుజనల అందరు మొక్కుకునే దర్గాని కాపాడాలని ఉర్సు ఉత్సవం మొదలైయ్యే నాటికి అన్ని సౌకర్యాలు కల్పించాలి కోరారు ఈ కార్యక్రమంలో కొండమిది నర్సింహా రావు, వట్టెపంగు సతీష్, కస్తాల సాయి, కత్తి నరసింహ తదితరులు పాల్గొన్నారు