పాలకీడు కేకే మీడియా జూలై 29
మొహరం పీర్ల పండగ సందర్భంగా జాన్ పాడ్ దర్గా వద్ద జరిగిన కార్యక్రమంలో శనివారం ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్న ఓజో ఫౌండేషన్ అధినేత
పిల్లుట్ల రఘు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రతిష్టాత్మక జాన్ పహాడ్ దర్గాలో లాంఛనాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు
ఈ సందర్భంగా రఘు మాట్లాడుతూ
జాన్ పహాడ్ లోని పీర్ల చావిడి కి 2022 లో స్థలం ఇప్పించి ఈరోజు చావిడి నిర్మాణానికి సహకారం అందించి పండుగ ఘనంగా నిర్వహించారు
కుల మతాలకతీతంగా ప్రజలందరు కలిసి చేసుకునే పండుగ మెహరం అని అన్నారు
గతంలో జాన్ పహాడ్ దర్గా ఉర్సు పండుగ సందర్భంగా దాదాపు 20,000 మందికి అన్నదాన కార్య క్రమం నిర్వహించగా దర్గాలోనికి దర్శనం కోసం వెళ్తుంటే ఎమ్మెల్యే ఆదేశాలతో కావాలని పోలీసులను అడ్డు పెట్టుకొని లోపలికి వెళ్లకుండా అడ్డుకున్న విషయం అందరికీ తెలుసు అని. కానీ ఈరోజు ముస్లిం సోదరులు దర్గా లోనికి ఏకమై దర్గాలో నికి ఆహ్వానం పలకటం ఆనందంగా ఉందని రానున్న రోజుల్లో తనకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తే హుజూర్ నగర్ నియోజకవర్గ అభివృద్ధితోపాటు ముస్లింల హక్కుల కోసం ముస్లింల అవసరాలు తీర్చడం కోసం తన వంతు సహకారం అందిస్తానని. జాన్ పాడ్ దర్గా అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.