హైదరాబాద్ కేకే మీడియా ఏప్రిల్ 14
కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి కుందూరు జానారెడ్డిని నల్లగొండ పార్లమెంటు సభ్యులు కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం పరామర్శించారు. ఇటీవల జానారెడ్డి అస్వస్థతకు గురై హైదరాబాద్ స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటుండగా పుష్పగుచ్చం అందజేసి ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. . త్వరగా కోలుకొని ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఉత్తమ్ కోరారు. ఎంపీ ఉత్తమ్ వెంట పాలకవీడు మండలం బెట్టే తండా సర్పంచ్ మాలోతు మోతిలాల్ నాయక్ తదితరులున్నారు.