పుష్ప-2తో జాతీయ అవార్డు ఖాయమంటున్న రష్మిక
ప్రముఖ హీరోయిన్ రష్మిక గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలో గురువారం పాల్గొన్నారు. తాను పుష్ప 2 సినిమా ప్రమోషన్ కోసం వచ్చానని.. పుష్ప-2 సినిమాను దేశవ్యాప్తంగా ప్రేక్షకులు చూసి ఆదరిస్తారనే నమ్మకం ఉందంటూ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ‘పుష్ప- 2 లో మీ నటనకు జాతీయ అవార్డు వస్తుందని అనుకుంటున్నారా?’ అని ఓ విలేఖరి ప్రశ్నకు “వస్తుందని అనుకుంటున్నాను.” అంటూ రష్మిక ఓ చిన్న స్మైల్ ఇచ్చారు.