మిర్యాలగూడ కే కే మీడియా సెప్టెంబర్ 9
అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల వేళ మిర్యాలగూడ నియోజకవర్గంలో ముఖ్యమైన రోజుగా భావిస్తున్న తొమ్మిదో తారీఖు నాడు ఇప్పటివరకు ఎలాంటి హామీ దొరకనప్పటికీ కచ్చితంగా తనకే టికెట్ వస్తుందన్న నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ ఆశావాహుడైన బత్తుల లక్ష్మారెడ్డి నామినేషన్ వేసేందుకు కాంగ్రెస్ శ్రేణులను సమీకరించి రాలీగా వెళ్లడంతో మిర్యాలగూడ పట్టణం జనసంద్రంగా మారింది. అశేష జన వాహిని నడుమ ర్యాలీగా వెళ్లి నామినేషన్ సమర్పించారు. కాంగ్రెస్ అధిష్టానం మిర్యాలగూడ స్థానాన్ని అధికారికంగా ప్రకటించినప్పటికీ మొన్నటివరకు సిపిఎం పార్టీ పొత్తులో భాగంగా మిర్యాలగూడ స్థానాన్ని సిపిఎంకు కేటా ఇస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో దీనికి తోడు కాంగ్రెస్ అసమ్మతి పోటీని పరిగణలో తీసుకొని అధికారిక ప్రకటన చేయనప్పటికీ బత్తుల లక్ష్మారెడ్డి మాత్రం ఇప్పటికే స్వతహాగా ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు. నామినేషన్ల పర్వం శుక్రవారం ముగుస్తుండడంతో అందరూ మంచి రోజుగా భావిస్తున్న తొమ్మిదో తారీఖు నాడు భారీ జన సమీకరణ చేసి తన సత్తా చాటడంతో మిర్యాలగూడ రాజకీయాన్ని ప్రత్యర్ధులను ఒక్కసారిగా ఆశ్చర్యపరిచేలా తన బలాన్ని నిరూపించుకున్నట్ల అయింది. ఎన్నికల నామినేషన్ ఉపసంహరణ సమయానికల్లా పొత్తులుంటాయి అన్న ఊహాగానాలు ఉన్నప్పటికీ పుత్తులు ఉన్నా లేకున్నా బరిలో నిలుస్తా అని ఇప్పటికే సంకేతాలు ఇచ్చిన బిఎల్ఆర్ తన అంతిమ బలనిరూపనని చూపించుకున్నట్ల అయింది. ఇక ఎన్నికల బరిలో ఎవరుంటారో ఎవరు గెలుస్తారో వేచి చూడాలి మరి