నేరేడుచర్ల కేకే మీడియా ఫిబ్రవరి 20
నేరేడుచర్ల పట్టణం లోని జాన్ పాడ్ రోడ్ లో గల జేపీఎస్ ఆటో యూనియన్ సభ్యులకు జనసేన పార్టీ హుజూర్నగర్ నియోజకవర్గ కార్యనిర్వాహక అధ్యక్షులు సరికొప్పుల నాగేశ్వరరావు సోమవారం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం అందజేశారు. క్రియాశీలక సభ్యత్వం వలన ప్రమాదవశాత్తు మరణించిన వారికి 5 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50 వేల రూపాయలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. నిత్యం వాహనాలతో ప్రయాణం చేసే వారికి క్రియాశీలక సభ్యత్వం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. అనంతరం వారితో కలిసి జనసేన పార్టీ క్యాలెండర్ ను ఆవిష్కరించారు.
కార్యక్రమంలో సాయి చరణ్, మధు,శ్రీనివాస్ రెడ్డి,నాగరాజు, నరసింహనాయుడు,జహంగీర్, వెంకటేష్,శ్రీను,అంజి, జేపీఎస్ ఆటో యూనియన్ సభ్యులు జనసేన సైనికులు తదితరులు పాల్గొన్నారు.