హుజూర్నగర్ కేకే మీడియా నవంబర్ 25
బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా మొట్టమొదటిసారిగా హుజూర్నగర్ నియోజకవర్గ ఎన్నికల ప్రచార సభకు శనివారం వచ్చిన నేపథ్యంలో సభా ప్రాంగణం ప్రేక్షకులు లేక వెలువల పోయింది.
తెలంగాణ లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మూడు రోజుల్లో ఎన్నికల ప్రచార పర్వం మోగియనున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఎన్నికల ప్రచారం కోసం ప్రత్యేకంగా హెలికాప్టర్లో హుజూర్నగర్ కు విచ్చేయగా జన సమీకరణ కోసం బిజెపి అభ్యర్థి చల్లా శ్రీలత రెడ్డి ప్రయత్నించినప్పటికీ వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన ప్రజలు మాత్రం సభా ప్రాంగణంలోకి రాకపోవడంతో నడ్డా మాట్లాడే సమయానికి సభా ప్రాంగణం వెలవల పోయింది.