హైదరాబాద్ కేకే మీడియా మార్చ్ 10
న్యూ ఢిల్లీ లో మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి, ఆమోదింపజేయాలని డిమాండ్ చేస్తూ భారత జాగృతి సంస్థ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర శుక్రవారం ఉదయం 10.15కి నిరాహార దీక్ష ప్రారంభించారు.ఇందులో భాగంగా ముందుగా స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాలకు పూలమాలలు వేసిన ఆమె,ఆ తర్వాత దీక్షా స్థలి దగ్గర కూర్చున్నారు.మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించడం ద్వారా మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ లభిస్తుందని,ఇప్పటివరకూ అలా జరగట్లేదని ఈ దీక్షను నిర్వహిస్తున్నారు. దీనికి సీపీఐ,సీపీఎం తోపాటూ ఎన్సీపీ,టీఎంసీ, సమాజ్ వాదీ పార్టీ, డీఎంకే,ఆప్,నేషనల్ కాన్ఫరెన్స్,శివసేన,పీడీపీ, జేడీయూ,ఆర్జేడీ, అకాలీదళ్,ఆర్‌ఎల్డీ, జేఎమ్‌ఎమ్ సహా 18 పార్టీలు సంఘీభావం ప్రకటించాయి.సాయంత్రం 4 గంటల వరకు ఈ దీక్ష కొనసాగనుంది.సీపీఐ కార్యదర్శి డి.రాజా ఎమ్మెల్సీ కవిత దీక్షను విరమింపజేస్తారని తెలుస్తుంది.ఈ ధర్నాలో బీఆర్ఎస్ నేతలు, మహిళా మంత్రులు, కార్యకర్తలతో పాటూ 29 రాష్ట్రాల్లో మహిళా హక్కుల కోసం పోరాడుతున్న వారు కూడా పాల్గొన్నారు.