Wednesday, May 14, 2025
HomeTelanganaచౌటుప్పల్లో పోలీస్. మార్చ్

చౌటుప్పల్లో పోలీస్. మార్చ్

*చౌటుప్పల్ లో పోలీసుల రూట్ మార్చ్*

చౌటుప్పల్,

: చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో పోలీస్ రాపిడ్ యాక్షన్ ఫోర్స్, స్థానిక సీఐ మన్మధ కుమార్ సిబ్బంది ఆధ్వర్యంలో రూట్ మార్చ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్, సివిల్ పోలీసులతో ఏరియా డామినేషన్ గురించి స్థానిక పోలీస్ స్టేషన్ నుండి వలిగొండ క్రాస్ రోడ్ నుండి తంగడపల్లి క్రాస్ రోడ్ నుండి బస్టాండ్ మీదుగా చిన్న కొండూరు రోడ్డు,శివాజీ నగర్ బిసి కాలనీలో, లాంగ్ మార్చ్ నిర్వహించినట్లు చెప్పారు. రూట్ మార్చ్ లో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ 30 మంది, సివిల్ పోలీసులు 20 మంది మొత్తం 50 మంది సిబ్బందితో రూట్ మార్చ్ నిర్వహించారు. ముందు ముందు రాబోయే కాలంలో అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రాపిడ్ యాక్షన్ కమాండెంట్ వినోద్, పూజారి, రాజు, చౌటుప్పల్ సబ్ ఇన్ స్పెక్టర్ లు యాదగిరి, కృష్ణమల్లు యాదవ రెడ్డి ఏఎస్ఐలు కరుణాకర్, జానయ్య తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments