ఎడారిగా మారిన చెరువులు నిండేది ఎప్పుడో !
నేరేడుచర్ల కేకే మీడియా ఆగస్టు 11 ;:
రబీలో కనీస వర్షపాతం లేక చెరువులు కుంటలు ఎండిపోయి ఎన్నడూ లేని కరువు విలయతాండవం చేసినట్లుగా అడుగంటిన జలాలతో చెరువులు కుంటలు బీటలు వారాయి. దీంతో అనేక గ్రామాల్లో జలాలు అడుగంటి బోర్లు ఇండ్లలో బావులు సైతం పూర్తిగా ఎండిపోయాయి అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
సాగర్ ఎగువన కర్ణాటక తదితర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు వస్తున్న వరద కారణంగా సాగర్ డ్యాం నిండి కుడి,ఎడమ కాలువకు పంట నీరు విడుదల చేస్తూ భారీగా వచ్చే వరదలకు గేట్లెత్తి కిందికి విడుదల చేస్తున్న పరిస్థితి అయినప్పటికీ కుంటలు, చెరువులు మాత్రం నీరు రాకపోవడంతో ఇంకా ఎడారులనే తలపిస్తున్నాయి.
సరైన వర్షపాతం నమోదు కాకపోవడమే దీనికి కారణం. కానీ పంట పొలాల నుండి వచ్చే వృధా నీరుతో నిండాల్సిన చెరువులు కూడా ఇప్పటికీ నీరు రాకపోవడంతో కుంటలు చెరువుల పై ఆధారపడి వ్యవసాయం చేసే రైతన్న ఆర్థికంగా స్తోమత లేని కొందరు రైతులు బోర్లు బావులు ఏర్పాటు చేసుకోలేక కుంటలపై ఆధారపడి కనీసం నారుమళ్లు కూడా దక్కించుకోలేని పరిస్థితిలో ఉండడంతో ఆందోళన చెందుతున్నారు.
చాలా చోట్ల చెరువులు కుంటలు ఆక్రమణలకు గురవుతున్న సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉండడం కాలువల ద్వారా చెరువులు నింపే వ్యవస్థ గతంలో ఉన్నప్పటికీ వాటిని సైతం ఆక్రమించుకొని చెరువులు నింప లేని పరిస్థితి ఏర్పడ్డ దానిపై కనీస చర్యలు తీసుకోకపోవడంతో ఇలాంటి సమస్యలు ఉత్పత్నమవుతున్నాయని రైతే రాజు అని మాటలకే పరిమితం చేయకుండా రైతుల కోసం ఆలోచించే వ్యవస్థని అధికారుల్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని
ఇలాంటి సమస్యలు మళ్లీ పునరావృతం కాకుండా వెంటనే ప్రత్యామ్నాయ మార్గాలతో కుంటలు చెరువులు నింపి సమగ్ర రైతు శ్రేయస్సును కాపాడాలని బాధిత రైతులు కోరుతున్నారు.