Monday, January 13, 2025
HomeTelanganaచెకుముకి" సైన్స్ పోటీ పరీక్షలో సత్తా చాటిన విద్యార్థులు

చెకుముకి” సైన్స్ పోటీ పరీక్షలో సత్తా చాటిన విద్యార్థులు

చెకుముకి” సైన్స్ పోటీ పరీక్షలో సత్తా చాటిన విద్యార్థులు

సూర్యాపేట జిల్లానేరేడుచర్ల కేకే మీడియా జనవరి 27

జన విజ్ఞాన వేదిక (జెవివి) ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న”చెకుముకి” సైన్స్ సంబరాలు 2024 “లో భాగంగా నేరేడుచర్ల మండల స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు శనివారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నేరేడుచర్ల నందు నిర్వహించారు.
మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలల విద్యార్థిని, విద్యార్థులకు తెలుగు,,ఇంగ్లీష్ మీడియం విభాగాలలో సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. పోటీ పరీక్షల్లో మండలంలోని ప్రభుత్వ ,ప్రైవేటు 11 ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విభాగంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దిర్శించర్ల విద్యార్థినులు మొదటి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నేరేడుచర్ల విద్యార్థులు ద్వితీయ బహుమతులు గెలుచుకున్నారు. తెలుగు మీడియం విభాగంలో మొదటి బహుమతి జడ్పీ హైస్కూల్ మేడవరం,ద్వితీయ బహుమతి జిల్లా పరిషత్ హై స్కూల్ దాచారం పాఠశాలలకు దక్కినవి. ప్రైవేటు విద్యాసంస్థల విభాగంనుండి మొదటి బహుమతి పినాకిల్ హై స్కూల్, ద్వితీయ బహుమతి ప్రగతి విద్యాలయం నేరేడుచర్ల విద్యార్థులు కైవసం చేసుకున్నారు. జన విజ్ఞాన వేదిక నేరేడుచర్ల మండల కన్వీనర్, న్యాయవాది, చిత్రంవిశ్వనాథ్, కో కన్వీనర్ శ్రీను, ప్రభుత్వ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో నిర్వహించిన సైన్స్ ప్రతిభ పోటీ పరీక్షల్లో గెలుపొందిన విద్యార్థులకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నేరేడుచర్ల ప్రధానోపాధ్యాయుడు బట్టు మధు, “క్రాంతి నికేతన్” స్వచ్ఛంద సంస్థ అధినేత సుంకర క్రాంతి కుమార్ బహుమతులు ప్రధానం చేశారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయులు శ్రీనివాస్,ఎం. మాధవి ఎన్.విజయ్ కుమార్, సత్యనారాయణ, శ్యామ్, జానయ్య, సైదయ్య, శ్రీనివాస్ రెడ్డి, అజీమ్,సైదా, పి.డి రవి, వెంకటేశ్వరరావు, నరసింహారావు, రషీద్, కల్పన, నగేష్, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments