హుజూర్నగర్ కేకే మీడియా నవంబర్ 23
రాజకీయాల్లో అగ్రస్థానం కోసం విదేశాల నుండి వచ్చి రాజకీయ ఆరంగేట్రం చేసిన హుజూర్నగర్ బిజెపి అభ్యర్థి చల్లా శ్రీలత రెడ్డి అధికార బీఆర్ఎస్ లో చేరి స్థానిక ఎమ్మెల్యేకు సన్నిహితంగా మెలుగుతూ నేరేడుచర్ల మున్సిపల్ పట్టణ పార్టీ అధ్యక్షురాలుగా నేరేడుచర్ల మున్సిపల్ వైస్ చైర్మన్గా స్థానికంగా ఉన్న రాజకీయ ఉద్దండులను కాదని అనుషంగా తెరమీదకి వచ్చి అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన వేళ పార్టీ పదవికి , మున్సిపాలిటీ హోదాకు రాజీనామా చేసి బిజెపిలో రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్న తన అన్న సహకారంతో హుజూర్నగర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం లభించడంతో ప్రచారాన్ని ముమ్మరంగా చేస్తూ అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్లకు టెన్షన్ పుట్టిస్తోంది. నేరేడుచర్ల సొంత గ్రామం కావడం కుల పరంగా బంధువులు అధికంగా ఉండడం స్థానికంగా పదవిలో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు వ్యక్తిగత సహకారం అందించడం నియోజకవర్గ లో పనచోట్ల ఉన్న పరిచయాలు సంబంధాలు తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తుండడంతో గతంలో రెండు వేలకు మించని ఓటు బ్యాంకు ప్రస్తుత ఎన్నికల్లో ఎంత ఎంత పెరిగిన అది ఎవరిపై ప్రభావం పడుతుందో అన్న మీమాంసలో కాంగ్రెస్ బి ర్ యస్ నాయకత్వం ఉంది. ఎన్నికలకు ఇంకా కొన్ని రోజులే సమయం ఉండడం కాంగ్రెస్ బి ర్ యస్ లు పోటాపోటీగా 50,000 మెజారిటీతో గెలుస్తామన్న దిమాలో ఉండడం చల్లా చేస్తున్న ప్రచారం ఎంత మేరకు ఎవరికి గడ్డి పడుతుందో అని ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజకీయాల్లో చిరకాల మిత్రులు ,శత్రువులు ఉండరన్న సామెతకు అర్థం పట్టే విధంగా ఎమ్మెల్యే సైదిరెడ్డిని ఓడించడమే నా ధ్యేయమంటూ తన ముఖ్య అనుచర గణంతో అంటున్న గుసగుసలు బయటికి వస్తున్నప్పటికీ. బందు గణం మొత్తం సాంప్రదాయ కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఉండడం తీవ్ర చర్చ నీ అంశమైంది. జాతీయ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెల్లాకు తనకు గౌరవప్రదమైన ఓటు బ్యాంకు తెచ్చుకుంటేనే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని తీవ్ర ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆమె బంధుగణం మద్దతు ప్రకటిస్తుందో, గతంలో పరిచయాలు సంబంధాలు వ్యక్తిగత సహకారం అందించిన కుటుంబాల నుంచి ఎంత మేరకు ఓటు బ్యాంకు మారనుందో ఒకవేళ మారితే ఎవరి ఓటు బ్యాంక్ కు గండి పడనుందో వేచి చూడాలి మరి.