చలికాలంలో స్నానం చేసేటప్పుడు ఈ విషయంపై శ్రద్ధ వహించండి
ప్రస్తుతం చలి చంపేస్తోంది. చల్లటి గాలులు వీస్తుండటంతో స్వెట్టర్స్ లేకుండా బయటకి వెళ్లల్లేని పరిస్థితి ఉంటది. మన దగ్గరే కాదు దేశంలోని చాలా చోట్ల ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి.అయితే చలికాలంలో ఆరోగ్య పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మనం చాలా సందర్భాలలో స్నానం చేస్తున్నప్పుడు గుండెల్లో నొప్పి రావడం, లేదా బాత్రూమ్ లో గుండెపోటుతో మరణించారు అని వింటుంటాం. పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా చాలామంది ఇలా చనిపోయినవాళ్లు ఉన్నారు. చలికాలంలో స్నానం చేసే సమయంలో మనకు గుండెపోట వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ ఉంటుంది. దీనికి ఒక ప్రధాన కారణం చలికాలంలో సరిగ్గా స్నానం చేయకపోవడమేనంట. అవును ఇది నిజమే, అసలు స్నానంకి గుండెపోటుకి సంబంధం ఏంటా అని ఆలోచిస్తున్నారా?చలికాలంలో బాత్రూమ్ లో స్నానం చేసే సమయంలో చాలా మందికి గుండెపోటు వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. కాబట్టి చలికాలంలో ప్రతి ఓక్కరూ దీనిపై పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే స్నానం చేసేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ చూడండి.
స్నానం చేసేటప్పుడు ఈ విషయంపై శ్రద్ధ వహించండి
చల్లని వాతావరణంలో సరైన స్నానం ప్రతి ఒక్కరికీ చాలా ముఖ్యం. ముందుగా పాదాలను కడుక్కోండి తర్వాత నడుము కింది భాగంలో నీళ్లు పోయండి. ఇలా స్నానం చేయడం వల్ల గుండెపోటు రాకుండా చూసుకోవచ్చు. మీరు చల్లని వాతావరణంలో మీ శరీరంపై అకస్మాత్తుగా నీటిని పోస్తే అది మీ ఆరోగ్యానికి తీవ్రమైన సమస్యలను కలిగిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. కాబట్టి సరిగ్గా స్నానం చేయడం చాలా ముఖ్యం.
స్నానానికి ముందు శరీరానికి మసాజ్ చేయండి
చల్లటి వాతావరణంలో స్నానానికి ముందు ఆవాల నూనె లేదా కొబ్బరి నూనె ఉపయోగించండి. ఈ నూనెలతో మసాజ్ చేయడం వల్ల అనేక వ్యాధుల నుంచి బయటపడవచ్చు. ఇలా చేయడం వల్ల జలుబును కూడా నివారించవచ్చు. మసాజ్ చేసిన తర్వాత తలస్నానం చేయడం వల్ల శరీరంలో రక్తప్రసరణ మెరుగవుతుందని తద్వారా గుండెపోటు ముప్పు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు