హైదరాబాద్ కేకే మీడియా మార్చ్ 13
తెలుగోడి సత్తా ఆస్కార్ లో నిలిచిపోయింది. తెలుగు దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందించిన RRR చిత్రానికి 2023 బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు లభించింది. ఆస్కార్ దక్కించుకున్న తొలి భారతీయ గీతంగా నాటునాటు పాట చరిత్ర సృష్టించింది. ఈ పాటకు సంగీతాన్ని సమకూర్చిన ఎమ్ ఎమ్ కీరవాణి పాట రాసిన చంద్రబోస్ కొరియోగ్రఫీ ప్రేమ్ దీక్షిత్ పాట పాడిన రాహుల్ సిప్రిగంజ్ కాలభైరవ చరిత్ర సృష్టించగా కీరవాణి చంద్రబోస్ లు అవార్డు అందుకున్నారు.
ఈ పాటకు అద్భుతమైన డాన్స్ చేసిన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఆస్కార్ అవార్డు ప్రధాన ఉత్సవ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు