నేరేడుచర్ల కేకే మీడియా సెప్టెంబర్ 20:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులకు జ్ఞానోదయం కలిగి అక్రమంగా అరెస్టుకు గురైన చంద్రబాబు కడిగిన ముత్యంల జైలు నుండి బయటకు రావాలని ఆకాంక్షిస్తూ నేరేడుచర్ల లోని విజయదుర్గా ఆలయానికి చంద్రబాబు అభిమానులు టెంకాయలు కొట్టి అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించి అమ్మవారిని వేడుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ సర్కార్ చేస్తున్నది అవినీతిపై యుద్ధం కాదని ప్రతీకరమ్ తీర్చుకునే ప్రక్రియలో భాగంగానే సరైన ఆధారాలు లేకున్నా అక్రమ అరెస్టు చేసి చంద్రబాబును జైల్లో రిమాండ్కు ఉంచటం సరైన పద్ధతి కాదని లక్షలాది కుటుంబాల్లో భవిష్యత్తు చూపించి వెలుగులు నింపిన చంద్రబాబు కడిగిన ముత్యంలో బయటికి రావాలని పాలకులకు జ్ఞానోదయం కలిగేలా అమ్మవారు చూడాలని కోరారు. పాల్వాయి రమేష్ పొనుగోటి జంగయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ వల్లన చెట్ల రమేష్ బాబు మాజీ సర్పంచులు ఆకార వెంకటేశ్వర్లు, సుంకర క్రాంతి కుమార్ , వింజమూరు వెంకటయ్య, కౌన్సిలర్ నారాయణ దంపతులు, వాసవి క్లబ్ అధ్యక్ష , ఉపాధ్యక్షులు కొత్త లక్ష్మణ్ కందిబండ హరిప్రసాద్, నాగ శేఖర్ ,పుల్లయ్య, మాల్యాద్రి, యారవ సురేష్, నామ సత్యనారాయణ ప్రసాద్, వెంకటేశ్వరరావు, వెంగళరావు, సుబ్బారావు తిరుపతయ్య. న్యాయవాది సుంకర ప్రదీప్తి, చెరుకూరి తిరుపతమ్మ, కుంకు ఆదిలక్ష్మి, పూర్ణ చౌదరి తదితరులు పాల్గొన్నారు