సీఎం చంద్రబాబు ను కలిసిన జనసేన నేత రామ్మోహన్
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను శనివారం శ్రీకాకుళం నగరంలో ఆముదాలవలస నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ ఛార్జ్ పేడాడ రామ్మోహన్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు ఆముదాలవలస నియోజకవర్గ రాజకీయ పరిస్థితులను రామ్మోహన్ వివరించారు. అనంతరం నియోజకవర్గం అభివృద్ధి అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.