నేరేడుచర్ల కేకే మీడియా సెప్టెంబర్ 18:
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో బాధ్యుడు ను చేస్తూ జైలుకు పంపించిన జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తో పాటు దేశంలోని అనేక రాష్ట్రాల్లో విదేశాలలో చంద్రబాబు అభిమానులుగా అతని విజయనరీతో సాఫ్ట్వేర్ రంగాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పరచి ఎన్నో జీవితాల్లో వెలుగు నింపిన చంద్రబాబుకు కుల మతాలకు ప్రాంతాలకు పార్టీలకు అతీతంగా మద్దతు నిరసన ర్యాలీలు చేస్తున్న తరుణంలో
నేరేడుచర్ల మున్సిపల్ పరిధిలో పెద్ద ఎత్తున చంద్రబాబు అభిమానులు ,మద్దతుదారులు కుల, మతాలకు, పార్టీలకతీతంగా ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీని నేరేడ్చర్ల ప్రధాన సెంటర్లలో నిర్వహించి చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ చంద్రబాబును బే షరతుగా వెంటనే విడుదల చేయాలని కోరుతూ పెద్ద ఎత్తున నినాదాలు నిర్వహించారు.