నేరేడుచర్ల కేకే మీడియా నవంబర్ 20
నేరేడుచర్లలో చంద్రబాబు బెయిల్ పట్ల సంబరాలు. చంద్రబాబు నాయుడుకు హైకోర్టులో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమానికి సంబంధించి సిఐడి కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ పై విడుదలైన విషయం విధితమే , చాలా రోజులుగా పూర్తిస్థాయి బెయిల్ కోసం వాదనలు జరిగి కోర్టు తీర్పు రిజర్వులో ఉన్న నేపథ్యంలో సోమవారం నాడు పూర్తి బెయిల్ మంజూరు కావడం పట్ల చంద్రబాబు నాయుడు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని మిఠాయిలు పంచుకొని , బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అరెస్టు అయిన నాటినుండి పూర్తిస్థాయి బెయిల్ మంజూరయ్యేంతవరకు సహకార అందించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకుడు పాల్వాయి రమేష్ కు చంద్రబాబు అభిమానులు శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో పాల్వాయి రమేష్, సుంకర క్రాంతి కుమార్,యారవ సురేష్ వెంకటయ్య జంగయ్య రాంబాబు నారాయణ,వేమురినారాయణ చిట్టిబాబు కిషోర్ శ్రీనివాసరావు సత్యనారాయణ, కుంకుమ మోహన్ సుబ్బారావు రోశయ్య రాంబాబు సురేందర్ వెంకటేశ్వర్లు నాగభూషణం, రవి మాలాద్రి, సుంకర ప్రదీప్తి ఆదిలక్ష్మి సులోచన సుబ్బమ్మ అన్నపూర్ణ రాధ వేమూరి నాగవేణి మనీ సంగీత కవిత సుజాత రమణ జయమ్మ విజయమ్మ రాజేశ్వరి ఉష రాఘవమ్మ తదితరులు ఉన్నారు.