నేరేడుచర్ల కేకే మీడియా ఆగస్టు 6
అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవ వేడుకలు . స్థానిక ఎస్.ఆర్.కె అపార్ట్ మెంట్ లో నివాసం ఉండే మహిళలు చిన్నారులు ఆదివారం సాయంత్రం కేక్ కట్ చేసి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ , శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టుకున్నారు. స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అంటూ గేయాలు ఆలపిస్తూ లయబద్దంగా ఆడుతూ పాడుతూ అలరించారు. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా వాట్సాప్ లలో ఉదయం నుండి శుభాకాంక్షల మెసేజ్ లతో సెల్ ఫోన్లు బిజీబిజీగా మారాయి.