యాదగిరిగుట్ట కేకే మీడియా మార్చి 1
యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాల్లో
భాగంగా ప్రధాన ఘట్టమైన స్వామివారి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగింది.
తూర్పు తిరుమాఢవీధుల్లోని బ్రహ్మోత్సవ మండపంలో మంగళవారం రాత్రి నిర్వహించిన దేవదేవుడి కల్యాణ మహోత్సవాన్ని భక్తులు కనులారా వీక్షించి పరవశించారు.