హుజూర్నగర్ కేకే మీడియా డిసెంబర్ 25
షిరిడి సాయి సమాజం ఆధ్వర్యంలో ఘనంగా దత్తాత్రేయ జయంతి సోమవారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని సాయిబాబా మందిరం నందు దత్తత్రేయ జయంతి ఉత్సవాలు ప్రతి సంవత్సరం నిర్వహించే ఉత్సవాలలో భాగంగా ఈ సంవత్సరం కూడా రెండు రోజులు పాటు నిర్వహించే ఉత్సవాలలో మొదటి రోజు సాయిబాబా, దత్తాత్రేయ స్వాముల ఊరేగింపు నగర సంకీర్తన భిక్షాటన, శోభాయాత్రకు ముఖ్యఅతిథిగా హుజూర్ నగర్ మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చనరవి పాల్గొన్నారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చనరవి మాట్లాడుతూ బాబా అందరికీ ప్రభువు అని బాబా అందరితో కలసిమెలసి ఉండే వారని, ఆడేవారని పాడేవారని, దేవుని కోసం అన్వేషణ మాని, మనం ఏం చేసినా అది దేవుడికి తెలుస్తుందని గుర్తుంచు కోవాలని బాబా చెప్పారని తోటివారిని ఏదో విధంగా బాధ పెడుతూ, హింసిస్తూ దేవునికి పూజలు చేసినా ఫలితం ఉండదని, మంచి పనులు చేయడం ద్వారానే దేవునికి దగ్గర అవ్వాలని హితబోధ చేశాడని,మానవ సేవే మాధవ సేవ అని ఎన్నోసార్లు గుర్తుచేశాడని తోటివారిని విసిగించేవారు, బాధించేవారు పాపపు రాశులను పెంచుకుంటారని, ఆ ఫలితాన్ని అనుభవించక తప్పదని,తాము కష్టపడి అయినా,ఇతరులకు మేలు చేసేవారు జీవితాన్ని సార్ధకం చేసుకుంటారని స్పష్టం చేశాడని అన్నారు.అనంతరం సాయిబాబా దత్తాత్రేయ అలంకరణ గులాబీ చామంతి మల్లెపూవులచే పూజా నిర్వహణ ఆలయ అర్చకులు రెంటాల సతీష్ శర్మ ఆధ్వర్యంలో జరిపించారు.ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చనరవి,శిరిడి సాయి సమాజం సెక్రెటరీ ఓరుగంటి నాగేశ్వరరావు,కోశాధికారి తోడుపు నూరి శేఖర్,సాయి భక్తులు గుండా రమేష్,పోలిశెట్టి వెంకటేశ్వర్లు, తండు సైదారత్నం,రమణ,అనంత రాములు,భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.