నేరేడుచర్ల కేకే మీడియా మార్చి 29:
నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలో తెలుగుదేశ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రాష్ట్ర నాయకులు పాల్వాయి రమేష్, పట్టణ అధ్యక్షులు పోనుగోటి జంగయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు, ఇట్టి కార్యక్రమం లో రాష్ట్ర నాయకులు పాల్వాయి రమేష్ మరియు పలువురు మాట్లాడుతూ, యుగ పురుషుడు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి, బడుగు బలహీన వర్గాల ప్రజలకు అట్టడుగు నాయకులకు రాజకీయ అవకాశాన్ని కల్పించి, ఉమ్మడి రాష్ట్రంలో మరియు తెలంగాణలో రాజరిక దొరల పెత్తందారుల వ్యవస్థకు నిర్మూలించి మహిళలకు మరియు బీసీ వర్గాల రాజకీయ అవకాశాలు కల్పించిన నందమూరి తారక రామారావు మరియు ఆయన బాటలో నవ్యాంధ్ర నిర్మాత నారా చంద్రబాబునాయుడు గారు ఉమ్మడి రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయికి నిలబెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఈరోజు మన తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాదును ప్రపంచ స్థాయిలో నిలిపాడు, రానున్న రోజుల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికారం లోకి రావడానికి కృషి చేస్తామన్నారు, ఈ కార్యక్రమానికి కుంటి గొర్ల, రామచంద్రుడు, ఎడవల్లి వెంకటరెడ్డి, నరసింహారావు, జింకల పిచ్చయ్య, సామ సైదులు, నాగేష్ శ్రీరాములు వెంకన్న, పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు