కేకే మీడియా నేరేడుచర్ల
జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను నేరేడుచర్ల మండల కేంద్రంలో ప్రధాన కూడలి వద్ద 56 కేజీల కేక్ ని కట్ చేసి హుజూర్నగర్ నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ సరికొప్పుల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
సోమవారం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు సందర్భంగా జన సైనికులతో కలిసి 56 కేజీల భారీ కేక్ ని కట్ చేసి, బాణాసంచా కాల్చి వేడుకలు నిర్వహించిన అనంతరం మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
రానున్న రోజుల్లో తెలంగాణలో జనసేన పార్టీని విస్తరించి తెలంగాణలో కూడా సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అయ్యప్ప మాల ధారణ చేసిన స్వాములకు, జన సైనికులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు
ఈ కార్యక్రమం లో కొమ్మ రాజు శ్రీను, సాయి చరణ్, కీసర నరేష్, చారి నాగ, మధు, యశ్వంత్, చందు, రాకేష్, అంజి, ఫహీం, వెంకన్న, కాలం సైదులు, రాంతుల్లా మొదలగు జనసైనికులు పాల్గొన్నారు…