నేరేడుచర్ల కేకే మీడియా ఫిబ్రవరి 19
శివాజీ జయంతి సందర్భంగా నేరేడుచర్ల హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆదివారం
చత్రపతి శివాజీ మహారాజు చిత్రపటానికి హిందు ధర్మ పరిరక్షణ సమితి అధ్యక్షులు పాల్వాయి రమేష్, సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూ ధర్మం కోసం చత్రపతి శివాజీ ఎంతో పోరాటం చేశారని, తన ప్రాణాలను సైతం త్యాగం చేశారని, హిందువులందరూ ఐక్యమత్యంతో ఉండాలని హిందూ ధర్మంపై దాడి చేసే వారిని వ్యతిరేకించాలని పార్టీలకు అతీతంగా అన్ని హిందూ కార్యక్రమాల్లో పాల్గొనాలని తెలిపారు. కార్యక్రమంలో కాల్వ సైదులు, దేవిరెడ్డి నాగిరెడ్డి, పాల్వాయి పృథ్వి, ఎడవల్లి సైదిరెడ్డి, కడియం సతీష్, వెన్నం సురేష్, రాగిరెడ్డి సూర్య తేజరెడ్డి,సంకలమద్ది సత్యనారాయణరెడ్డి ,కొణతం నాగిరెడ్డి, బాల వెంకటేశ్వర్లు, , ఉరిమల్ల రామమూర్తి, తాళ్ల నరేందర్ రెడ్డి, తాటికొండ పరమేశ్వర్ రెడ్డి, చారగుండ్ల సైదులు, బాలెన వెంకటకృష్ణ,సరికొప్పుల నాగేశ్వరరావు, ఎడవల్లి నర్సిరెడ్డి, పుల్లెంల సైదులు, రాచకొండ శ్రీను, సాయి, ఈశ్వర్ ఊటుకూరి నటరాజు, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.