నేరేడుచర్ల కేకే మీడియా జులై30:
లయన్స్ క్లబ్ ఆఫ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పీఎంజేఎఫ్ లయన్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఘట్టమనేని బాబురావు జన్మదినం సందర్భంగా మంగళవారం నేరేడుచర్ల లో అల్పాహార కార్యక్రమాన్ని నేరేడుచర్ల క్లబ్ అధ్యక్షులు జిలకర రామస్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు మాట్లాడుతూ శ్రీ గట్టమనేని బాబు రావు తెలుగు రాష్ట్రాలలో చేసిన వివిధ సహాయ సహకారాలు మరువలేనివి వారి ఆధ్వర్యంలో అందించిన ఆర్థిక సాయంతో ఎన్నో సంస్థలు నడపబడుతూ పేద ప్రజలను కాపాడుతున్నాయని అన్నారు.
లైన్స్ క్లబ్ ఒక స్వచ్ఛంద సంస్థ పేద ప్రజలకు సేవే మార్గముగా పనిచేయుచున్నది ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలను సేవా కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది అని ఆయన అన్నారు. అనంతరం పేదలకు అల్పాహారం అందించారు
.కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జోన్ చైర్ పర్సన్ చల్లా ప్రభాకర్ రెడ్డి లయన్ బట్టు మధు,లయన్ ఎడవెల్లి సత్యనారాయణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి లయన్ గుండ్రెడ్డి సైదిరెడ్డి,కోశాధికారి లయన్ ఎస్కే యూసఫ్, లయన్స్ సభ్యులు చిత్రం విశ్వనాధ్,మూలగుండ్ల,చిలక రాజు శ్రీను,వెంకటరెడ్డి,బసవ కోటేశ్వరరావు,ఆది రెడ్డి,బాలిన సైదులు,ఉప్పల లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు