నేరేడుచర్ల కేకే మీడియా ఏప్రిల్ 19
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు పెంచికల్ దిన తొలి సర్పంచ్ కొంజేటి నారాయణ మూడో వర్ధంతిని పెంచికలదిన్నెలోని ఆరివండి భవన్లో బుధవారం ఘనంగా నిర్వహించారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెంచికల్ దిన మాజీ సర్పంచ్ సుంకర క్రాంతి కుమార్ అతిథిగా పాల్గొని మాట్లాడుతూ
తెలంగాణ ఉద్యమంలో కొంజేటి నారాయణ కుటుంబం సేవలు మరువలేనివి అని పెంచికల్ దిన చరిత్రను చరిత్ర పుటల్లో నిలిపిన వ్యక్తుల్లో ఒకరని అన్నారు
ఈ కార్యక్రమంలో కె నారాయణ సతీమణి సత్యవతి ఆలియాస్ రంగక్క సిపిఎం మండల కార్యదర్శి సిరికొండ శ్రీనివాస్, పెంచికల్ దిన మాజీ సర్పంచ్ మరి నాగేశ్వరరావు, మాజీ పిఎసిఎస్ చైర్మన్ కర్నాటి మురళి, సింగిల్ విండో డైరెక్టర్ వల్లంచెట్ల నారాయణ, గ్రామ సిపిఎం కార్యదర్శి అల్వాల శ్రీధర్, రాములమ్మ, బిక్షం, కొంజేటి రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు