హుజూర్నగర్ కేకే మీడియా డిసెంబర్ 11
*కార్తీక మాసం చివరి రోజున శివ స్వాముల ప్రత్యేక పూజలు*
*హుజూర్ నగర్ పట్టణంలో శివ స్వాములు ప్రత్యేక పూజలు..
కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా హుజూర్ నగర్ పట్టణంలో సోమవారం శ్రీ పార్వతీ భీమలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో శివ స్వాములు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శివ స్వాములు అఘోరవేషధారణలో వారి పీఠం వద్ద నుండి శివాలయానికి కాలినడకన చేరుకొని స్వామివారికి పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గురుస్వామి యరగాని శ్రీనివాస్, వట్టికూటి వెంకటేశ్వర్లు, బెల్లంకొండ అమర్,పంగ సిద్దు, పిట్టల రవి, బెల్లంకొండ రమేష్,మెరిగ గురవయ్య,బెల్లంకొండ అనిల్ ఉపేందర్,వంశీ ,అశోక్,రామకృష్ణ, వీరస్వామి,కొండల్,శివ,రాము, సాయి,గోకుల్,మధు,పద్మ, గురవయ్య, సత్యనారాయణ,ఉమా, శివ స్వాములు పాల్గొన్నారు.